శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : శనివారం, 6 జులై 2019 (11:08 IST)

వధువు కావలెను.. ప్రకటన ఇచ్చిన 84 సంవత్సరాల వృద్ధుడు

84 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకోవడం కోసం ఓ వృద్ధుడు పేపర్‌లో యాడ్ ఇచ్చాడు. ఇదేమిటి ఆ వయస్సులో ఆయనకు ఏమి అవసరమొచ్చింది? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా? తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తన కళ్లు, పళ్లు, మోకాళ్లు, చెవులు బాగానే పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చాడు. 
 
అంతేకాకుండా తనకు రూ.3 కోట్లు విలువ చేసే ఇల్లు ఉందని, బ్యాంకులో రూ.5 లక్షలు ఎఫ్‌డీ ఉందని తెలిపాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు లేవని, తాను శాకాహారినని ప్రకటించాడు.
 
ఈ ప్రకటన ఏ మ్యారేజ్ బ్యూరో తరపున వచ్చిందనుకుంటే పొరపాటేనండోయ్..ఆ వృద్ధుడే స్వయంగా పేపర్ ప్రకటన ఇచ్చాడు. ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నారో లేక కొడుకులు గానీ, కూతుళ్లుగానీ పట్టించుకోలేదోమో గానీ ఆయన ఈ ప్రకటన ఇచ్చాడు. 
 
ఈ న్యూస్ పేపర్ కటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అంత వయస్సులో ఆయన చేసిన పనికి కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొంత మంది మాత్రం నాటీ గ్రాండ్ పా అంటూ సెటైర్లు వేస్తున్నారు.