సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (11:08 IST)

అమ్మో.. హైబీపీనా? ఐతే సోయాను వాడండి.. పుచ్చకాయలు తినండి..

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలంటున్నారు.. వైద్య నిపుణులు. అధిక రక్తపోటును నియంత్రించేందుకు సోయా లేదా పాల ఉత్పత్తులు బాగా ఉపయోగడుతాయని వారు చెప్తున్నారు. హైబీపీని నియంత్రించుకోవాలంటే.. సోయా ఉత్పత్తులు తీసుకోవాలట. 
 
ఎందుకంటే? రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల స్థానంలో సోయా లేదా మిల్క్ ప్రొటీన్ తీసుకుంటే హై బి.పి కి చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ సప్లిమెంట్లు తీసుకున్న వారితో పోల్చితే మిల్క్ ప్రొటీన్ సప్లిమెంట్లు, సోయా ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో సిస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ తగ్గినట్లు ఆ పరిశోధన తేల్చింది. 
 
హైపర్ టెన్షన్, హైబీపీని నియంత్రించుకోవాలంటే సోయా ఉత్పత్తులతో పాటు.. నీటిశాతం ఎక్కువగా వున్న పుచ్చకాయల్ని కూడా తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
పుచ్చకాయల్లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయని తేలింది. పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినొచ్చునని వైద్యులు సెలవిస్తున్నారు.