గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (12:08 IST)

దుష్టశక్తులు ఆవహించాయనీ.. త్రిశూలంతో కళ్లు పీకేశారు.. ఎక్కడ?

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళ కళ్ళు పీకేశారు. దుష్టశక్తులు ఆవహించాయన్న ఆరోపిస్తూ త్రిశూలంతో ఆమె కళ్లు పీకేశారు. జార్ఖండ్‌లోని గర్వా ప్రాంతంలో జరిగిన ఈ దారుణం సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని కొండిర గ్రామానికి చెందిన రుడానీదేవి అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు.. ఆలందేవి - సత్యేంద్ర ఓరన్ అనే తాంత్రిక విద్యలు చేసే దంపతులను ఆశ్రయించగా, రుడానీదేవికి దుష్టశక్తులు ఆవహించాయని నమ్మించారు. 
 
దీంతో త్రిశూలం లాంటి పదునైన ఆయుధంతో ఒళ్లంతా తూట్లు పొడిచారు. అంతేకాదు, ఆమె రెండు కళ్లను పెకిలించారు. దీంతో బాధతో విలవిల్లాడిన రుడానీదేవి కన్నుమూసింది. విషయం వెలుగులోకి రావడంతో రుడానీదేవి కుటుంబ సభ్యులతోపాటు, తాంత్రిక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.