శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 5 ఆగస్టు 2019 (21:22 IST)

ప్రతిరోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే...

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు మూడు అరటిపండ్లను తీసుకోవడం వలన గుండెపోటు సమస్యలను అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొక అరటిపండు, రాత్రి భోజనం తరువాత మూడో అరటిపండు తీసుకునే వారి శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
 
పాలు, గింజలు, చేప, స్పానిష్ వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోడం కంటే మూడు అరటిపండ్లను రొజువారీ తీసుకోవడం వలన గుండెపోటు, రక్తపోటు వంటివి తగ్గిపోతాయని వారు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సంవత్సరానికి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
రోజూ మూడు అరటి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటుని నియంతచ్రించవచ్చని ఆ పరిశోధనలో తేలింది.