శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By tj
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (12:51 IST)

గుండెకు ఎండుకొబ్బరి ఎంత మేలో...!

పచ్చికొబ్బరిని తింటే ఎంత రుచిగా ఉంటుందో.. ఎండిన తర్వాత కూడా అంతకు రెట్టింపు రుచి వస్తుంది. అంతేకాకుండా ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు. కొబ్బరిలో నీరు పూర్తిగా ఆవిరైతే మ

పచ్చికొబ్బరిని తింటే ఎంత రుచిగా ఉంటుందో.. ఎండిన తర్వాత కూడా అంతకు రెట్టింపు రుచి వస్తుంది. అంతేకాకుండా ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు అన్నిఇన్ని కావు. కొబ్బరిలో నీరు పూర్తిగా ఆవిరైతే మరింత రుచిగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉండటం ఖాయమంటున్నారు వైద్యులు. అధిక లావు తగ్గి చలాకీగా ఉండాలంటే ఎండుకొబ్బరి తినాలట. ఎండుకొబ్బరి జీర్ణమవ్వడానికి సమయం పట్టినా కానీ అందులోని పోషకాలు ఎంతో మేలుచేస్తాయట.
 
ఎండుకొబ్బరిలో ట్రాన్స్‌ ఫాట్స్ అధికంగా ఉంటాయనేది అపోహ మాత్రమే. కొలొస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండదు. ఎండుకొబ్బరిలో ఫైబర్, కాపర్, సెలీనియంతో పాటు చాలా నూట్రీషియంలు ఉంటాయట. ఈ కారణంగానే డ్రైఫ్రూట్స్‌లో ఎండుకొబ్బరిని బెస్ట్‌గా చెబుతారట. 
 
అలాగే గుండె సంబంధిత వ్యాధిని నివారించడంలో ఎండుకొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యలర్ డైట్‌లో ఎండుకొబ్బరి చేరిస్తే మెదడు ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది. సెలనో ప్రొటీన్స్‌ను పెంచి అనేక వ్యాధి కారకాలను నివారిస్తుందట.