సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 నవంబరు 2023 (21:48 IST)

స్త్రీలకు బ్లడ్ కౌంట్ బాగా పెరగాలంటే?

black grapes
ఎండు ద్రాక్ష కొంతవరకు తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండు ద్రాక్ష ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్‌తో దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది.
 
ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం, మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది.
 
ఎండుద్రాక్షలు మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి. మగవారు ఎండుద్రాక్ష తింటుంటే అవసరమైన శక్తి ఒనగూరుతుంది.