స్త్రీలు ఎండుద్రాక్ష తింటే ఏమవుతుంది?
ఎండు ద్రాక్ష. ఇవి కొంతవరకు తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది.
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది.
ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. ఎండుద్రాక్షలోఎసిడిటిని తగ్గించే పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఎండుద్రాక్ష తినడం వలన శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. ఎండుద్రాక్షలో వుండే పోషకాలు మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి.