1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (16:04 IST)

ప్లాస్టిక్ బాక్సుల్ని ఉపయోగిస్తున్నారా? సూప్‌లను నింపేస్తున్నారా? కిడ్నీ సమస్యలు తప్పవండోయ్

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని తీసుకెళ్తుంటే.. ఇక వాటిల్లో వేడివేడిగా అన్నాన్ని నింపి బ్యాగుల్లో పెట్టేయడం నింపేయండి. రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు.. చిన్న పిల్లలకు బాక్సుల్లో స్నాకులు, ఆహారాన్ని నింపేవ

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని తీసుకెళ్తుంటే.. ఇక వాటిల్లో వేడివేడిగా అన్నాన్ని నింపి బ్యాగుల్లో పెట్టేయడం నింపేయండి. రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు.. చిన్న పిల్లలకు బాక్సుల్లో స్నాకులు, ఆహారాన్ని నింపేవారు ఇకపై వాటిని ఉపయోగించకపోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్‌ డబ్బాల్లో ఆహారాన్ని తీసుకువెళ్లి తినేవారికి జుట్టు వూడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. 
 
అంతేగాకుండా స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్‌ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి ఇవ్వడం వల్ల చిన్నవయసులోనే వారు పలు అనారోగ్య సమస్యలు తప్పవని, కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్‌ కారకాలు వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేగాకుండా.. ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి అన్నాన్ని నింపడం ద్వారా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తేలింది. 
 
హాట్ సూప్‌లు వంటివి ప్లాస్టిక్ కంటైనర్లలో నింపడం ద్వారా అందులో యాసిడిక్ పదార్థాలు ఉత్పత్తి అవుతాయని తద్వారా కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తేందుకు కారకమవుతాయి. ఈ సమస్య చిన్నాపెద్దా అని తేడాలేకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్ల ద్వారా ఆహారాన్ని తీసుకునే వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.