శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (12:07 IST)

తెల్లసొనతో ముఖ సౌందర్యం.. ప్యాక్‌లా వేసుకుంటే మాట్లాడకూడదు..

తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ అదనపు ఆయిల్‌ను తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఎగ్‌వైట్‌ను ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకుని ఆరనివ్వాలి. కానీ ఎగ

తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ అదనపు ఆయిల్‌ను తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఎగ్‌వైట్‌ను ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకుని ఆరనివ్వాలి. కానీ ఎగ్‌వైట్ ముఖానికి అప్లే చేసుకుంటే.. ఆరేంతవరకు మాట్లాడకూడదు. ముఖాన్ని కదపకుండా అలానే వుండాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఎగ్‌వైట్‌లో తేనె, పాలు కలుపుకున్నా చర్మ సౌందర్యం మెరుగవుతుంది.
 
అదేవిధంగా పెరుగును ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. పెరుగులో కొంచెం తేనే కలుపుకుంటే మాయిశ్చయిర్‌గానూ పనిచేస్తుంది. వారంలో ఒకరోజు ఇలా చేయడం వల్ల చర్మంలో జిడ్డుదనం లేకుండా పోతుంది. టమోటా కూడా చర్మ అందాన్ని మెరుగుపరుస్తుంది. 
 
టమోటాల్లో ఉండే నేచురల్ ఆయిల్ ఆబ్జార్బింగ్ యాసిడ్స్ ముఖంపై వచ్చే అదనపు ఆయిల్‌ను తొలగించేందుకు తోడ్పతాయి. టొమోటోను రెండు ముక్కలుగా కట్‌ చేసి ముఖంపై రబ్‌ చేసుకోవాలి. పావుగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.