శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 4 జనవరి 2016 (12:07 IST)

శరీరానికి తాత్కాలిక శక్తినిచ్చే కూల్‌డ్రింక్స్‌తో ఆరోగ్యానికి హాని?

పండ్లు, కాయగూరలు ఇవన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి. ఆయా సీజన్లలో పండే పండ్లు, కూరగాయలు ఆరగించడం మనకు అలవాటు. ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు మనకు లభిస్తుంది. ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలుతో తయారుచేసే పదార్థాలు ఆరోగ్యానికి ఎప్పుడు మేలు చేస్తుంది. ఏ కాలంలోనైనా దాహం అనిపించినప్పుడు మనకు మొదట గుర్తుకొచ్చేది కూల్‌డ్రింక్స్. 
 
శరీరానికి తాత్కాలిక శక్తినిచ్చే కూల్‌డ్రింక్స్ అంటే చాలామంది ఇష్టం. రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తాగినవెంటనే తాత్కాలికంగా హుషారుగా, మత్తుగా అనిపిస్తుంది. కానీ ఈ కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఇవి రక్తపోటు పెరగటానికే కాదు, గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే శక్తినిచ్చే పానీయాలు తాగినవారికి రక్తపోటు కూడా సగటున 3.5 పాయింట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 
 
కాబట్టి అధిక రక్తపోటు లేదా క్యూటీ సిండ్రోమ్‌ గలవారు శక్తి పానీయాలను తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని నిపుణులు అంటున్నారు. శక్తినిచ్చే పానీయాల్లో కెఫీన్‌ మూలంగా వీటికి అలవాటుపడే ప్రమాదమూ ఉంది. దీంతో వీటిని తాగకపోతే కొన్నిసార్లు తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తుంది. కెఫీన్‌ సేవించడం వల్ల శరీరంలోని నీటి స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి దాహం వేసినప్పుడు ఇలాంటి శక్తినిచ్చే పానీయాల కన్నా నీళ్లు తాగటమే మేలు.