శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (13:10 IST)

అంజీరను వెన్నతో కలుపుకుని తీసుకుంటే? శృంగార సమస్యలుండవ్

అంజీర పండును సలాడ్స్, ఓట్ మీల్, చట్నీలు, సల్సా, పాస్తాల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రత్యేకించి రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. రక్తహీనత అనగానే ఐరన్‌ ట్యాబ్లెట్లను తీసుకోవడం క

అంజీర పండును సలాడ్స్, ఓట్ మీల్, చట్నీలు, సల్సా, పాస్తాల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రత్యేకించి రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. రక్తహీనత అనగానే  ఐరన్‌ ట్యాబ్లెట్లను తీసుకోవడం కంటే సహజసిద్ధమైన అంజీరను తీసుకోవడం మంచిది. 
 
అంజీర పండులో  పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు కావలసినంత  పీచుపదార్థం కూడా ఉంటుంది. పలురకాల పోషకాలతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫైటో కెమికల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎండు పండ్లలో అత్యధికంగా పోషకాలు అంజీరలోనే అధికంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలు తేల్చాయి. తరచూ జలుబు చేసిందంటే ఈ అంజీరపు పళ్ళ రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. మహిళలు రోజు రెండు పళ్ళు తింటే మొటిమలు తగ్గుతాయి. సౌందర్యం మెరుగవుతుంది. నిత్యయవ్వనులుగా ఉండాలంటే.. అంజీర పండును తప్పకుండా తీసుకోవాల్సిందే.
 
అంజీర ఫలం‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడని వారు వీటిని పది నుంచి పన్నెండు చొప్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఐరన్ అందుతాయి. అత్తిపండ్లు దాంపత్య జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. శృంగార సమస్యలను దూరం చేస్తాయి. వీటిని నేరుగా లేకుంటే బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.