శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (12:11 IST)

క్యాలీఫ్లవర్ తీసుకోండి.. క్యాన్సర్‌ను కిడ్నీ సమస్యల్ని తరిమికొట్టండి..!

విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ క్యాలీ ఫ్లవర్‌లో పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే చాలా మంచిది. క్యాన్సర్

విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ క్యాలీ ఫ్లవర్‌లో పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే చాలా మంచిది. క్యాన్సర్‌ను నివారించాలంటే క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సి ఉండటం ద్వారా ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది
 
క్యాలీఫ్లవర్లోని ఫోలెట్‌ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. పరిశోధనల ప్రకారం కాలీఫ్లవర్ ఫైటోకెమికల్‌లను క్యాలీఫ్లవర్ కలిగి ఉండటంతో రొమ్ము క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్‌లను తగ్గిస్తుంది. క్యాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్‌లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్‌లోని యాంటీ యాక్లిడెంట్లు క్యాన్సర్ కారకాలపై పోరాడుతాయి. 
 
కిడ్నీ సంబంధిత వ్యాధులకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ వ్యాధులు దరిచేరవు. యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడటానికి క్యాలిఫ్లవర్ చక్కటి పరిష్కారం. యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపించడంలో క్యాలీఫ్లవర్‌ సహాయపడుతుంది.