బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (13:20 IST)

కరివేపాకు పొడిని, పచ్చడిని ఆహారంలో భాగం చేయాల్సిందే..

కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కరివేపాకు కొలెస్టరాల్‌ను, మధుమేహాన్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‌గా కరివేపాకును స్వీకరిస్తే మూత్రపిండాల వ్యాధులు తొలగిపోతాయి. కరివేపాకు ఆకులను నూరి నెయ్య

కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కరివేపాకు కొలెస్టరాల్‌ను, మధుమేహాన్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్‌గా కరివేపాకును స్వీకరిస్తే మూత్రపిండాల వ్యాధులు తొలగిపోతాయి. కరివేపాకు ఆకులను నూరి నెయ్యిని గాని, వెన్నను కాని కలిపి కాలిన గాయాలపై పూయడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకల బలహీనత గలవారికి కరివేపాకు ఎంతో మంచిది. కరివేపాకు వేసి కాచిన నూనెను తలకు రాసుకుంటే జుట్టు పెరగడమే కాక నల్లదనాన్ని కూడా సంతరించుకుంటుంది. 
 
కరివేపాకులో మన శరీరానికి ఎంతో అవసరమైన ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, బీ విటమిన్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, తాజా కరివేపాకులో కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, క్యాలరీలు కూడా అందుతాయి. ఇలా అత్యధిక పౌష్టిక విలువలు కలిగిన కరివేపాకును మనం కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆహారంలో కరివేపాకు పొడిని, పచ్చడిని భాగం చేయాలని వారు చెప్తున్నారు.