గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 16 జులై 2016 (17:05 IST)

చద్దన్నంలోని ఉపయోగాలేంటో తెలిస్తే.. ఆవురావురుమంటూ తింటారు.. నిజమా?

చద్దన్నం అంటేనే చాలామందికి నచ్చదు. వేడి వేడి అన్నం ముందు చద్దన్నం ఏం తింటాములే అన్నట్లుంటుంది వ్యవహారం. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేదే చద్దన్నం. అప్పట్లో చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినే

చద్దన్నం అంటేనే చాలామందికి నచ్చదు. వేడి వేడి అన్నం ముందు చద్దన్నం ఏం తింటాములే అన్నట్లుంటుంది వ్యవహారం. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేదే చద్దన్నం. అప్పట్లో చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. దాన్నిఒక పౌష్టికాహారంగా చూసేవారు. కాని ఇప్పటి కాలంలో రాత్రి అన్నం మిగిలిపోతే పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తున్నారు.
 
అయితే ఆ చద్దన్నంలో ఉండే ఉపయోగాలేంటో తెలుసుకుంటే పడేయకుండా ఆవురావురుమంటూ తింటారు. చద్దన్నం తింటే ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుందని నిపుణులు సైతం సూచిస్తున్నారు. చద్దన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 
* చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
* శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే కొబ్బరినీరు తాగడం మంచిది. కాని అంతకంటే చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి త్వరగా తగ్గిపోతుంది.
* పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను చద్దన్నం నశింపజేస్తుంది.
* చద్దన్నం తింటే శరీరం తేలికగా మారి కొత్త ఉత్తేజాన్నిస్తుంది.
* మల బద్దకం, నీరసంగా ఉన్నవారు చద్దన్నం తీసుకుంటే ఆ సమస్యలన్నీ తగ్గుతాయి.
* అల్సర్ వ్యాధిని తగ్గిస్తుంది.