పాల వల్ల కలిగే ప్రయోజనాలు
ఇక మనం రెగ్యులర్ గా పాలను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది చూస్తే... పాలను తాగడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలని మనం పొందవచ్చు. నిజంగా పలు తాగితే ఎన్నో సమస్యలని మనం పరిష్కరించుకోచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
1. పళ్ళు, ఎముకలు గట్టి పడటానికి పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి రోజూ పాలను తాగండి.
2. అదే విధంగా వ్యాయామం చేసే వాళ్ళు కండల పెరగడానికి పాలు తీసుకోవాలి. ఎందుకంటే పాలల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. దీనితో కండరాలు అభివృద్ధి చెందుతాయి.
3. అలానే వేడి వేడిగా పాలను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా దూరం అవుతుంది కాబట్టి మలబద్ధకంతో బాధ పడేవారు ప్రతి రోజూ వేడి వేడి పాలను తీసుకోండి.
4. ఇది ఇలా ఉంటే బాగా అలసటగా ఉన్నప్పుడు హుషారు రావాలంటే కూడా వేడి పాలు తీసుకోండి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇది బాగా మేలు చేస్తుంది.
5. గొంతు నొప్పితో బాధపడే వాళ్ళు పాలలో కాస్త మిరియాల పొడి వేసుకుని తాగితే చక్కటి రిలీఫ్ ని పొందొచ్చు. ఇలా కూడా పాలు ఉపయోగపడతాయి.
6. వేడి వేడి పాలు తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరమైపోతుంది. అంతే కాదు మంచి నిద్ర కూడా పొందొచ్చు.
7. ఒకవేళ కనుక మీ పిల్లలు పాలు తాగకపోతే బాదం పొడి లేదా మరి ఏదైనా ఫ్లేవర్ ని యాడ్ చేసి ఇవ్వండి దీంతో వాళ్లు పాలని ఇష్టపడే అవకాశం ఉంది. అలా కూడా ఇష్టపడక పోతే సోయా మిల్క్ లేదా ఇతర ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తప్పక పెట్టండి.
ప్రోటీన్స్ తక్కువగా ఉంటే సమస్యలు వస్తాయి కాబట్టి రెగ్యులర్ గా మంచి పోషక పదార్థాలని ఇచ్చి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకోండి.