శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (17:03 IST)

కొవ్వును కరిగించే బీరకాయ.. వారంలో రెండుసార్లు తీసుకుంటే..?

Ridge Gourd
బీరకాయలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. ఇందులోని విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, థయామిన్ వంటి పోషకాలు వున్నాయి. బీరకాయలో తక్కువ కెలోరీలున్నాయి. ఇందులోని పీచు పదార్థాలు అధికంగా వున్నాయి.
 
కొవ్వును జీర్ణించేలా చేసి వాటిని కరిగించే శక్తి బీరకాయకు వుంది. బీరకాయను తీసుకుంటే కడుపు నిండిన భావన వుంటుంది. అందుచేత చిరు తిండ్లు తినడం మానేస్తారు. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది.
 
అలాగే డయాబెటిస్ తగ్గుముఖం పడుతుంది. బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. అందుకే వారానికి రెండు రోజులైనా బీరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆహార లోపాల వల్లే చర్మ సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే సోందర్యాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.