ఉదయాన్నే ఇలా స్నానం చేస్తే ఆరోగ్యం భేష్...

cold water bath
సిహెచ్| Last Modified గురువారం, 21 నవంబరు 2019 (22:26 IST)
చల్లని నీటితో స్నానం రోగ నిరోధకతను పెంచుతుంది. రెగ్యులర్‌గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చల్లని నీటితో స్నానం సాధారణ జలుబును నివారిస్తుంది. ఉదయం చేసే చన్నీటి స్నానం వల్ల సహజంగా వచ్చే జలుబును నివారించవచ్చు.

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. చన్నీటి స్నానం మొదటి ప్రయోజనం రక్త ప్రసరణ పెరగటం. చల్లని నీరు శరీరానికి తగిలితే అది రక్త ప్రసరణ పెంచి గుండె ఆరోగ్యం కాపాడుతుంది. అంతేకాదు, చర్మ కాంతి పెరిగి యవ్వనులుగా కనబడతారు. చన్నీటి స్నానం ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరం ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చన్నీటి స్నానం ఎంతో మంచిది.దీనిపై మరింత చదవండి :