స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా? (video)

సెల్వి| Last Updated: శుక్రవారం, 1 నవంబరు 2019 (19:31 IST)
స్టార్ ఫ్రూట్ ఎలా వుంటుందో మీకు తెలుసా? ఆ పండును తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. స్టార్ ఫ్రూట్‌లో పీచు పుష్కలంగా వుంటుంది. ఈ పండును డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పేగు సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. శీతాకాలంలో అధికంగా లభించే పండును తీసుకుంటే ముక్కుదిబ్బడ, జలుబు తొలగిపోతాయి.

ఇంకా వింటర్లో ఏర్పడే వ్యాధులు దరిచేరవు. అజీర్తి వుండదు. అలాగే స్టార్ ఫ్రూట్ పైల్స్‌ను దూరం చేస్తుంది. అందుకే రాత్రి నిద్రించేందుకు ముందు రెండు ముక్కలు లేదా అరకప్పు మోతాదులో స్టార్ ఫ్రూట్‌ను తీసుకుంటే పైల్స్ సమస్య వుండదు. ఇంకా వర్షాకాలంలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవాలి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా వుంటే అనారోగ్య సమస్యలు దరిచేరను.

ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం స్టార్ ఫ్రూట్‌లో వుంది. స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :