రోజంతా పనితో అలసిపోయారా..? గుమ్మడి గింజలను..?

సెల్వి| Last Updated: సోమవారం, 28 అక్టోబరు 2019 (14:08 IST)
రోజంతా పనితో అలసిపోయారా.. అయితే గుమ్మడి గింజలు హాయిగా నిద్రపోయేందుకు ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజంతా పనితో అలసిపోయిన మెదడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోవాలంటే పడుకోవడానికి గంటముందు నాలుగైదు గింజలు తినాలి. ఇలా చేస్తే అలసట తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది.

ముఖ్యంగా మగవారిలో తలెత్తే ప్రొస్టేట్ గ్రంథి వాపును నివారిస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండటానికి రోజుకి ఐదారు గింజలు తింటే మంచిది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ గింజలు గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీలకు అవసరం అయిన ఫైటోఈస్ట్రోజెన్లు ఈ గింజల నుంచి సమృద్ధిగా లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :