శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:26 IST)

అత్యంత విషమంగా నవాజ్ షరీఫ్ ఆరోగ్యం... ఒక్కసారిగా పడిపోయిన ప్లేట్‌లెట్స్

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆయనకు ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పాకిస్థాన్‌లోని సర్వీసెస్ ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆయన గుండెనొప్పితో బాధపడుతున్నారని, రక్తంతో ప్లేట్ లెట్స్ కౌంట్ కనిష్టానికి పడిపోయిందని, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టేనని అంటున్నారు. 
 
ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న నవాజ్ షరీఫ్ రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కరోజులోనే 45 వేల నుంచి 25 వేలకు పడిపోయాయని తెలుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో నిన్న రాత్రి సర్వీసెస్ హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 
 
ఆయన పరిస్థితి కుదుటపడేంత వరకూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయలేమని జైలు అధికారులకు వైద్యులు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరుగని కారణంగా స్వల్ప గుండెపోటుకు కూడా గురయ్యారన్న సంగతి తెలిసిందే.