గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (21:25 IST)

మహిళలు దానిమ్మ రసాన్ని తీసుకుంటే?

వర్షాకాలంలో వచ్చే కాళ్ళ పగుళ్లు, దురదలను అడ్డుకోవాలంటే పసుపు పొడితో తేనెను కలిపి పేస్ట్‌లా తయారు చేసి పూస్తే ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తేనెను చేర్చి తాగితే బాగా నిద్రపడుతుంది.  
 
రోజూ సపోటా జ్యూస్ తాగుతూ వస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం వంటి సమస్యలను అడ్డుకోవచ్చు. మజ్జిగలో అల్లం, కొత్తిమీర తరుగుల్ని చేర్చి తాగితే బాగా ఆకలి అవుతుంది. ఉసిరికాయ రసంలో తేనెను కలిపి తీసుకుంటే హై బీపీని నియంత్రించవచ్చు.  
 
దానిమ్మ రసాన్ని 40 రోజుల పాటు సేవిస్తే మహిళలు నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఖర్జూరం పండ్లు, ఒక కప్పు పాలు రోజూ తీసుకుంటూ నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.