శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:33 IST)

అలా చేసేటపుడు స్త్రీ లోదుస్తులు ఇలా వుండాలి

ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషికి వ్యాయామం తప్పనిసరి అయింది. గంటలకొద్దీ కుర్చీల్లో కూర్చుని పనిచేయడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అందువల్ల కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామం ఒక్కటే మార్గం. ఇకపోతే వ్యాయామం చేసే స్త్రీలు తమ దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా తగిన బ్రాలు ధరించి చేయాలి. వీటిలో స్పోర్ట్స్ బ్రాలు అయితే మంచిది.
 
వ్యాయామం సమయంలో ధరించే బ్రాలు కొన్నాళ్లకు వదులుగా మారిపోతాయి. వాటని మార్చేయాలి. ఇవే కాదు మామూలుగా వేసుకునే బ్రాలను కూడా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి కొన్నాళ్లు మాత్రమే ఫిట్నెస్ ఇస్తాయి. ఆ తర్వాత వాటి పనితీరు సరిగా ఉండదు.

అందువల్ల ప్రతి ఏడెనిమిది నెలలకోసారి వాటిని మార్చి కొత్తవి కొనుక్కోవాలి. బ్రాలకు ఉండే ఎలాస్టిక్ సామర్థ్యం పోవడంతో వక్షోజాలకు తగిన సపోర్ట్ ఉండదు. ఫలితంగా వాటి ఆకృతుల్లో తేడా వస్తుంది. కానీ ఎప్పట్నుంచో వాడుతున్నాం కాబట్టి అదే సైజు బ్రాలను వాడేస్తే సరిపోతుందని ఏసైజుపడితే ఆ సైజు కొనుగోలు చేయరాదు.