శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:10 IST)

టీ లేదా కాఫీలు తాగే ముందు ఒక గ్లాసుడు నీళ్లు తాగుతున్నారా?

ఆరోగ్యంతో పాటు చలాకీగా ఉండాలా? రోజంతా హుషారుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా సూర్యరశ్మి ముందుగా మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారమవుతాం. డి విటమ

ఆరోగ్యంతో పాటు చలాకీగా ఉండాలా? రోజంతా హుషారుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ముందుగా సూర్యరశ్మి ముందుగా మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారమవుతాం. డి విటమిన్‌ను పుష్కలంగా అందించే సూర్యరశ్మి మన శరీరంపై పడితే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.

అలాగే ఉదయం పూట టీ లేదా కాఫీలు తాగేముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీనివల్ల జీవక్రియలు వేగవంతం అవుతాయి. అలాగే రోజంతా హుషారుగా ఉండాలంటే.. బ్రేక్ ఫాస్ట్ హెల్దీగా ఉండాలి. తక్కువగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌గా 30 గ్రాముల బాదం.. ఒక కప్పు పెరుగుతో సరిపెట్టుకోవచ్చు. 
 
మీది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయాల్సిన ఉద్యోగమైతే కంటికి సమాన స్థాయిలో కంప్యూటర్‌ స్ర్కీన్‌ ఉండేలా చూసుకోండి. మోచేతులు, భుజాలు నిటారుగా ఉండాలి. ఎక్కువ సమయం కూర్చుంటే స్థూలకాయం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకోసారి కాసేపు లేవండి. కాసేపు నడవండి. ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చినపుడు నిల్చోండి. 
 
ఆఫీసుల్లో స్నాక్స్‌కు బదులు ఉదయం 11 గంటలకు సాయంత్రం 4 గంటలకు గుమ్మడికాయ కాన్‌బెర్రీ విత్తనాల వంటివి తీసుకోవాలి. భోజనంలో తప్పకుండా కోడిగుడ్డు.. రెండు కప్పుల సలాడ్ ఉండేలా చూసుకోండి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేయండి. అరగంట పాటు నడవండి. నిద్రకు 3 గంటల ముందే భోజనం పూర్తి చేయండి. ఇలా చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.