శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:14 IST)

భోజనంతో పాటు రెండు చెంచాల తేనె తీసుకుంటే.. కిడ్నీల ఆరోగ్యం భేష్..

ఎదిగే పిల్లలకు పోషకాహారంగా తేనె ఎంతగానో ఉపకరిస్తుంది. ఆరు నెలల పాటు రోజుకు రెండు లేదా మూడు స్పూన్ల తేనె తీసుకుంటే గుండెకు మేలు చేసినట్లే. తేనెను రోజువారీగా తీసుకుంటే కంటి దృష్టిలోపాలను తొలగించుకోవచ్చు

ఎదిగే పిల్లలకు పోషకాహారంగా తేనె ఎంతగానో ఉపకరిస్తుంది. ఆరు నెలల పాటు రోజుకు రెండు లేదా మూడు స్పూన్ల తేనె తీసుకుంటే గుండెకు మేలు చేసినట్లే. తేనెను రోజువారీగా తీసుకుంటే కంటి దృష్టిలోపాలను తొలగించుకోవచ్చు. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతులో ఏర్పడే సమస్యలను తొలగించుకోవచ్చు.
 
తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే శిశువులకు బలం చేకూరుతుంది. భోజనానంతరం తేనెను తీసుకుంటే పిత్తాన్ని దూరం చేసుకోవచ్చు. శరీర వేడిని తగ్గించుకోవచ్చు, 
 
మనం తీసుకొనే ఆహారపదార్ధాలు, పానీయాలు మొదలైనవి జీర్ణక్రియలో భాగంగా గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌లుగా మారిన తరువాత క్రమంగా జీర్ణం అవుతాయి. కానీ తేనె ఇలా ఏ మార్పులూ లేకుండా సులభంగా జీర్ణం అవుతుంది. కొత్తిమీర రసాన్ని మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి తగ్గిపోతుంది.  
 
తేనె రక్తాన్ని శుద్ధి చేసి, బ్లడ్‌ సర్క్యులేషన్‌ని క్రమబద్ధీకరిస్తుంది. ప్రతిరోజూ ఒక టేబుల్‌స్పూన్‌ తేనె నీటిలో కలిపి పరగడుపునే తీసుకుంటే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి క్రమం తప్పకుండా తేనె వాడితే సరిపోతుంది. 
 
అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు.
 
ఎనీమియా, ఆస్తమా, బట్టతల, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బిపి, ఒత్తిడి, పక్షవాతం వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. భోజనం‌తో పాటు రెండు మూడు చెంచాలా తేనే తీసుకుంటే అలసట, నిస్సత్తువు పోయి చాలా ఉత్సాహాంగా మారుతారు. శారీరకంగా బలాన్ని పెంచుతుంది.