Daily Horoscope
✕

బీపీని పరీక్షించుకోవడం ఎలాగంటే..?

Updated: మంగళవారం, 22 జనవరి 2019 (17:50 IST)
మనిషన్నాక ఏదో ఒక జబ్బు ఎప్పుడో ఒకప్పుడు వేధిస్తూనే ఉంటుంది. వాటిలో ముఖ్యమైన సమస్య రక్తపోటు.. అదే బీపి. చాలామంది నెలకు రెండు మూడు సార్లైనా బీపీ చెక్ చేసుకుంటుంటారు. ఐతే బీపీ ఎక్కువగా ఉందని బాధపడుతుంటారు. కానీ బీపీ పరీక్షించుకోబోయే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. 
 
1. బీపీ పరీక్ష చేయించుకునేటప్పుడు మీరు కూర్చునే విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ వెనకాల సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చోవాలి. పాదాలను రెండింటిని నేలపై ఆనించి ఉంచాలి. బీపీ చూసే చేతిని టేబుల్‌పై విశ్రాంతిగా ఉంచాలి. మోచేతి‌పై భాగం ఛాతి మధ్య భాగానికి వచ్చేలా చేతినివుంచాలి. 
 
2. రక్త పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళేముందు కనీసం అరగంటకు ముందు‌గానే కాఫీలు , టీలు, సిగరెట్లు తీసుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికంగా బీపీని పెంచుతాయి. 
 
3. పరీక్ష చేయించుకునేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడినా, విన్నా మనకు తెలియకుండానే స్వల్ప వత్తిడి పెరుగుతుంది. దీని వలన ఖచ్ఛితమైన బీపీ విలువ తెలుసుకోవడం సాధ్యం కాదంటున్నారు వైద్యనిపుణులు. 
 
4. ఆందోళనలూ పెట్టుకోకూడదు. ఆ సమయంలో మూత్రవిసర్జనను ఆపుకోవడంలాంటి చిన్నచిన్న వత్తిళ్లకు కూడా దూరంగా వుండాలి.
 
5. రెండు చేతులకూ పరీక్ష చేయించడం ఉత్తమం. రెండింటికీ నడుమ కనీసం 20 పాయింట్లు తేడా రావచ్చు. రెండింటిలోనూ ఎక్కువగావున్న దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

అన్నీ చూడండి

దారుణం : మరదలి జననాంగాన్ని కొరికిన ఆడపడుచు (వీడియో)

గుట్కా నమిలి విద్యుత్ హైటెన్షన్ వైరుపై ఉమ్మి ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

16 నెలల్లో 36 మందికి మరణశిక్షలు - తీర్పులిచ్చిన జడ్జి బదిలీ

ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను ముప్పు - గంటకు 140 కిమీ వేగంతో గాలులు

ఏఈ లలిత కుమారి హత్య కేసు : భర్తే ప్రధాన సూత్రధారి

అన్నీ చూడండి

నెలసరి సమయంలో నా భర్త ఎంతో సహకరించారు : హీరోయిన్ రష్మిక

విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నుంచి ‘నాన్నలా లోకములో’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్...

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సందడి..

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

తర్వాతి కథనం
Show comments