శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (12:34 IST)

పచ్చి ఉల్లిపాయ రసం చెవిలో పోస్తే...?

మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉల్లిపాయ వాడకం జరుగుతుంది. దీని ఆకు కూడా కూరలలో ఉపయోగించవచ్చును. ఉల్లిపాయలో మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు చాలా ఉన్నాయి. తేమ, ప్రోటీన్స్, కొవ్వు, ఖనిజములు, విటమిన్ సి, ఇనుము, భాస్వరము, కెరోటిన్, క్యాల్షియం, పీచు పదార్థం మొదలగునవి లభించును. ఔషధ యుక్తంగా కూడా ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది.
 
గుండెకు బలాన్ని కలిగిస్తుంది. అజీర్తి వ్యాధులను నివారించి, జీర్ణక్రియను సక్రమంగా పనిచేయిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. నోటిలో పుండ్లను తగ్గిస్తుంది. వీర్యాన్ని చిక్కగా అయ్యేటట్లు చేస్తుంది. దేహానికి బలం చేకూర్చి, శరీర బరువును పెంచుతుంది. నరాలకు పట్టుత్వం కలిగిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను హరిస్తుంది. మూత్ర సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.
 
ఎముకలకు శక్తినిస్తుంది. మెదడును చురుకుగా పనిచేయిస్తుంది. రక్తపోటు రాకుండా కాపాడుతుంది. పచ్చి ఉల్లిపాయరసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. మూర్చపోయిన వారికి ముక్కులో ఉల్లిరసం చుక్కలు పోస్తే మామూలు స్థితికి వస్తారు. తేలు కుట్టినవారు అరస్పూన్ ఉల్లిరసం తాగితే ఉపశమనం కలుగుతుంది. 
 
స్త్రీలలో ఋుతుక్రమం సరిగా అయ్యేటట్లు చేస్తుంది. బహిష్టు సమయంలో కలిగే బాధలను తగ్గిస్తుంది. గర్భాశయమునకు సంబంధించిన చిన్న చిన్న వ్యాధులను పోగొడుతుంది. ఉల్లిపాయలు ఎక్కువగా తినేవారికి కలరా వ్యాధి సోకదు. ఇది మెదడుకు శక్తినిచ్చి, తెలివితేటల్ని వృద్ధిపరుస్తుంది.