బంకమట్టి పాత్రల్లో తినండి... స్లిమ్‌గా ఉండండి...
పూర్వకాలంలో వంటిళ్ళలో మట్టిపాత్రలే కనిపించేవి. కుండలో నీరు తాగేవారు. మట్టి పాత్రల్లో వండిన అన్నం, కూర తినేవారు. ఇది వెనుకటి రోజుల్లో ఇదే వారి లైఫ్ స్టైల్. అందుకే ఆ కాలం మనుషులు ఎంతో దృఢంగా ఉండేవారని పరిశోధకులు అంటున్నారు. కానీ, ఇలాంటి పాత్రలు ఇపుడు మచ్చుకైనా కనిపించడం లేదు.
బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఉలా ఉంటాడు అనే ఆలోచనతో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఎలుకలపై చేసిన పరిశోధనలో కొవ్వుపట్టి ఉన్న ఎలుకలు బంకమట్టి తినడంతో సన్నబడ్డాయని తేలింది.
దీంతో మనిషి పరిశోధన చేసిన బంకమట్టి తినడంతో శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినవద్దని.. పరీక్షలు చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని సూచించారు. సైంటిస్టులు ప్రత్యేకంగా తయారు చేసిన బంకమట్టికే సాధ్యం అని తెలిపారు.
తమ పరిశోధనల్లో భాగంగా, తొలుత కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్ బంక మట్టిని అందజేశారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్ తీసుకున్న ఎలుకల్లో కంటే మట్టి తిన్న ఎలుకల్లో బరువు తగ్గడం స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు.
పైగా, బంకమట్టి తిన్న ఎలుకల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని వారు వెల్లడించారు.