లేత జామ ఆకులను నమిలితే అవి తగ్గిపోతాయ్...
జామ పండులో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే జామ ఆకులో మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిక్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలి పట్టినా ఈ సమస్యలు తగ్గుతాయి.
2. మూడు లేదా నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబందిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుము నొప్పి కూడా తగ్గుతుంది.
3. మనం తరచుగా జామ ఆకు కషాయాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
4. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జామఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్రపట్టేలా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ తీరుని మెరుగుపరుస్తుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
5. జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబందిత సమస్యలు రాకుండా ఉంటాయి.