పొట్ట మీద వున్న కొవ్వును తగ్గించుకోవడం ఎలా?
సాధారణంగా మనం శరీర బరువును తగ్గించుకోవటం కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా, మీరు ఆహారాన్ని తీసుకోకుండా బరువును తగ్గించుకోవటం కష్టం మరియు ఆరోగ్యానికి కూడా హానికరం. మీ నడుము చుట్టూ మరియు పొట్ట మీద ఉన్నకొవ్వును తగ్గించుకోవటానికి చాలా మంచి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఆహార సేకరణను తగ్గించటం వలన తాత్కాలికంగా మేలు కలుగవచ్చు. అయితే సరైన సమయం పాటూ నిద్ర లేకపోవటం, ఆయాసం మరియు ఒత్తిడి లాంటి ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా మీ శరీరంలోని, అదనపు కొవ్వును తగ్గించుకొనే మార్గాలను పరిశీలిద్దాం.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనగా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలను మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజాగా పండ్లను మరియు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. పొగ త్రాగటం, మత్తు పానీయాలను సేవించటం వంటి అనారోగ్య అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడు ఏదో ఒక పని చేస్తుండటం అనగా శరీరాన్ని ఎల్లపుడు ఇతర పనులకు కదల్చటం వంటివి చేయాలి. ఎక్కువగా నడవటం, మెట్లు ఎక్కడం లాంటి పనులు నిర్వహించాలి.
యోగ ద్వారా శరీరంలోని కొవ్వు పదార్థాలను శక్తివంతంగా తగ్గించుకోవచ్చు. రోజు యోగను అనుసరించటం వలన ఆరోగ్యం మెరుగుపడటం, శ్వాసలో సమస్యలు తగ్గటమే కాకుండా, శరీర బరువు కూడా తగ్గుతుంది. యోగాభ్యాసంలో శ్వాస వ్యాయామాలను చేయటం వలన ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్
అందించబడుతుంది.
ఊపిరితిత్తులకు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కావలసిన స్థాయిలో అందించబడుతుంది. ఇలా ఆక్సిజన్ శరీరంలోని ఇతర భాగాలకు లభించడం వలన శరీరంలోని కొవ్వును కరిగించడానికి, అవసరమయ్యే సమయం కంటే తక్కువ సమయం మరియు వేగంగా జరుగుతుంది. శ్వాసను పీల్చుకోవటం వలన శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. శరీరంలోని శక్తిని పెంచి, శారీరకంగా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.