శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:27 IST)

కొందరు పిల్లలు జుట్టు పీక్కుని ఇంట్లో రచ్చరచ్చ చేస్తుంటారు ఎందుకని?

సాధారణంగా చాలామంది పిల్లలకు కోపం ఎక్కువగా వస్తుంటుంది. చిన్న చిన్న విషయాలనే పెద్దగా చేస్తూ రాద్దాంతం చేస్తున్నారా.. మీరు చెప్పిన పనులు చేయడం లేదని బాధపడుతున్నారా. అయితే ఇలా చేయండి..
 
చిన్నారి అప్పుడప్పుడూ కోపంగా ఉండడం.. లేదా కాసేపు ఏం జరగనట్టు సంతోషంగా ఉండడం.. ఇలా రెండు రకలుగా ప్రవర్తిస్తుంటే జాగ్రత్తగా గమనిస్తుండాలి. వారు ఏదో బాధను మనసులో పెట్టుకుని ఉండొచ్చు. కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 
 
పిల్లలు గట్టిగా అరుస్తున్నప్పుడు మీకు కోపం వచ్చినా దాన్ని వ్యక్తం చేయకూడదు. ముఖ్యంగా అరిచే ప్రయత్నం అసలు చేయరాదు. కాసేపు అలానే మౌనంగా ఉండాలి. ఆ సమయంలో వారి కోపం స్థాయి తగ్గిపోతుంది. తరువాత వారు ఎందుకు అరుస్తున్నారనే కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేతప్ప మీరు అరవడం వలన ఏ ప్రయోజనం ఉండదు.
 
ఏదైనా విషయంలో పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారని అనిపించినా.. కోపంగా ఉన్నారనే సంకేతం అందినా.. వారి దృష్టిని మరల్చే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో వారికి ఇష్టమైన పనిచేసేలా చూడాలి. బొమ్మలు గీయడం, సైకిలు తొక్కడం.. ఇలా ఏదో ఒకటి చేస్తుండాలి. అప్పుడే వారిలో కొంత మార్పు కనిపిస్తుంది.