సంబంధిత వార్తలు
- Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్ థ్రిల్లర్ గా తత్వం ట్రైలర్
- Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా
- Jayasudha: రమణి కళ్యాణం సినిమా చూశా,మంచి ఫీల్‌గుడ్ మూవీ : జయసుధ
- మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా
- టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ - పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు
అధికంగా పసుపు వాడితే?
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది.
మోతాదుకి మించి పసుపు వాడితే మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు.
అధికంగా పసుపు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.
ఇప్పటికే కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినవారు పసుపును అధిక మోతాదులో తీసుకుంటే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.
శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు పసుపు సప్లిమెంట్లను ఉపయోగించడం మానేయడం మంచిది.
తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు మోతాదుకి మించి పసుపు వాడితే అది ప్రమాదకరమైనది కావచ్చు.
కొన్ని సందర్భాల్లో ఇది అలెర్జీలకు కారణం కావచ్చు.
