శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (18:03 IST)

వర్షాకాలంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలివే..?

వర్షాకాలం వస్తేనే చాలు.. అందరు అనారోగ్య సమస్యలో బాధపడుతుంటారు.. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. కనుక ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం..
 
వెచ్చని పానీయాలు తీసుకోకుండా.. టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతో పాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారుచేసిన టీ సేవిస్తే.. వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి. 
 
రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంగా భాగంగా చేసుకుంటే ఈ కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలలో బాధపడరు. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను పెంచి రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది. దీనివలన శరీరంలో అలర్జీలు వ్యాపిస్తాయి. కనుకు వీలైనంత వరకు కారం తిండి పదార్థాలు తీసుకోకండి..
 
ఇక ఐస్‌క్రీమ్స్ విషయాలకు వస్తే.. చలికాలంలో ఐస్‌క్రీమ్స్ అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే జలుబు వస్తుంది. దాంతో పాటు దగ్గు ఏర్పడి గొంతునొప్పి వస్తే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఫ్రిజ్ వాటర్ వాడడం కూడా మానేయాలి. ఇప్పుడు కూరగాయలు, పండ్లు.. పోషక విలువలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.. అంటే.. దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటి. ఇక కూరగాయలు.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర వంటివి తీసుకుంటే మంచిది.