శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (14:10 IST)

స్వీట్లపై అవి సిల్వర్‌ షీట్లా.. అల్యూమినియం షీట్లా..?

స్వీట్ షాపుల్లో స్వీట్స్ కొంటున్నారా? ఐతే స్వీట్లపై సిల్వర్‌ను తాపడం చేసేందుకు పలుచటి వెండి షీట్లను వినియోగిస్తుంటారు. నాణ్యమైన స్వీట్లను అందించే దుకాణాల సంగతిని పక్కనబెడితే.. చిన్న చిన్న స్వీట్ షాపులు, బండ్లపై వ్యాపారం నిర్వహించే వారు మాత్రం సిల్వర్ షీట్‌కు బదులుగా అల్యూమినియం షీట్‌ను ఉపయోగిస్తుంటారు. 
 
సిల్వర్ షీటు ధరతో పోలిస్తే అల్యూమినియం షీటు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అల్యూమినియం షీటును కొనుగోలు చేసి స్వీట్లపై తాపడం చేస్తున్నారు. ఈ మార్పును వినియోగదారులు గుర్తించలేరు. అందుకే సిల్వర్ కవర్ లేని స్వీట్స్‌ను కొనడం బెటరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్లపై వున్నది సిల్వర్ కలరే అనుకుని కొనుగోలు చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే ఆస్కారం వుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా స్వీట్లపై తాపినది సిల్వరా లేకుంటే అల్యూమినియమా అనేది తెలుసుకునేందుకు... ఆయా స్వీట్లపై ఉండే సిల్వర్ చేతికి అంటకపోతే.. అది ఒరిజినల్ అని కనుక్కోవచ్చు. ఒకవేళ చేతికి అంటితే అది అల్యూమినియం తాపడంగా గమనించాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.