శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 అక్టోబరు 2018 (14:41 IST)

టీనేజ్ పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసా?

ప్రస్తుతకాలంలో పిల్లలు చాలా బలహీనంగా, ఎదుగుదల లేకుండా, నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. దీనికి కారణం పోషకాహారలోపం. వీరికి సరియైన పోషకాహారం ఇవ్వకపోవటం వలన వీరిలో ఉత్సాహం, చలాకీతనం తగ్గిపోయి నిరుత్సాహంగా, బద్దకంగా తయారవుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలపై ఈ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. ఎదిగే పిల్లల కోసం కావలసిన పోషకాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి విటమిన్ ఎ ఎక్కువుగా ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి, కంటిచూపు మెరుగవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా క్యారెట్, చీజ్, పాలు, గుడ్డులో ఈవిటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కనుక ప్రతిరోజు క్రమంతప్పకుండా ఈ ఆహారపదార్ధాలను వాడటం మంచిది.
 
2. టమోటాలు, తాజా కాయగూరలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ధృడత్వానికి, అందమైన చర్మాన్ని పొందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లను పిల్లలకు తరచూ ఇస్తూ ఉండాలి.
 
3. పిల్లలలో రక్తం వృద్ధి చేయుటకు ఇనుము ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ పిల్లలకు పెట్టాలి. దీనివలన పిల్లలు ఎంతో ఉత్సాహంగా తయారవుతారు. పిల్లలకు సరియైన పోషకాహారం ఇవ్వటం వలన పిల్లల శరీరం దృఢంగా ఉండటమే కాకుండా మెదడు కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. దీనిప్రభావం వారి చదువులు, ఆటలు,బుద్ధి వికసించేటట్లు చేస్తాయి. కనుక టీనేజ్ పిల్లలకు సరియైన పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వటం ఎంతో అవసరం.