శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 16 అక్టోబరు 2018 (21:09 IST)

ఈ ఐదింటితో పురుషుల్లో ఆ సమస్య పరార్...

పూర్వం స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, గొడ్రాలని ముద్ర వేసేవారు. మగవారు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతులలో సంతానం కలగకపోవడానికి ఇద్దరిలో లోపం ఉండవచ్చు. ఈ లోపం వున్నా భార్య భర్తలు కొన్ని ఆహార నియమాలు పాటించడం వలన సమస్యను కొంతవరకు సాధించవచ్చు.
 
అరటి : అరటిని తీసుకోవడం వలన వీర్యవృద్ధికి సహాయపడుతుంది. దీనిలో బీ1, సి విటమిన్లు ప్రోటీన్‌లు లభిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన శృంగార హర్మోన్‌గా పనిచేస్తుంది.
 
పాలకూర : దీనిలో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది వీర్యవృద్దికీ సహకరిస్తుంది. పాలకూరలో విటమిన్ సి, ఐరన్ కూడా లభిస్తుంది.
 
మిరపకాయ : దీనిని కేవలం రుచి కోసం మాత్రమే అనుకుంటాము. ఇది మన ఆరోగ్యనికి మేలు చేస్తుంది. ఇది పురుషునిలో ఫెర్టిలిటీని పెంచడములో బాగా సహకరిస్తుంది. ప్రతి రోజు ఆహారంలో దీనిని తీసుకోవడం వలన ఎండార్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీనివలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటుంది. దీనిలో సి.బీ.ఈ. విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
 
టమాటో : ఈ కూరగాయను తీసుకోవడం వలన కెరొటినోయిడ్స్, లైకోపాన్, చక్కని వీర్యశక్తి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజు తినే ఆహారంలో దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి.
 
పుచ్చ : మగవారి ఫెర్టలిటీని మెరుగుపరచడంలో పుచ్చకాయం బాగా మేలు చేస్తుంది.