శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (13:32 IST)

వర్షాకాలం... ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? వర్షాకాలంలో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం అందరికీ ఇష్టమే. అలాంటప్పుడు ఈవెనింగ్ స్నాక్స్‌గా మొక్కజొన్నను ఇంట్లోనే ఫ్రై చేసుకుని తీసుకోండి. వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. క్లీన్‌గా ఉండే ప్రాంతంలో కూర్చుని తినండి. అలాగే కూరగాయలు పండ్లు ఏవైనా నీటిలో శుభ్రపరిచి ఆపై తీసుకోండి.
 
ఎక్కువగా ఊరగాయలు, చట్నీలు, మిరపకాయలు, పెరుగు, కూర వంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ఉప్పు ఎక్కువగా వుండే ఆహారాలు నీరు నిలుపుదల, అజీర్ణం, అధిక ఆమ్లత, కడుపు ఉబ్బరం వంటి వాటిని ప్రోత్సహిస్తాయి. బాగా వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు మాంసం తినకూడదు.
 
తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోండి. వండిన లేదా ఆవిరి కూరగాయలు, బీరకాయ, గుమ్మడికాయ, సలాడ్, పండ్లు, పెసర, కిచిడి, మొక్కజొన్న, శనగపిండి, వోట్మీల్‌తో తయారైన ఆహార పదార్థాలను ఎంచుకోవచ్చు. వంటలకు  తేలికగా ఉండే నెయ్యి, ఆలివ్ నూనె, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనెలను ఉపయోగించండి. హెవీ నూనెలైనా ఆవనూనె, వెన్న, వేరుశెనగ నూనెలను వాడకపోవడం మంచిది. 
 
వర్షాకాలంలో చేదు కూరగాయలను తినటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ, వేప, మెంతులు మరియు పసుపు వంటి చేదు మూలికలు ఇన్ఫెక్షన్‌లను నిరోధిస్తాయి. వర్షాకాలంలో కనీసం ఒక వారంలో రెండుసార్లు నువ్వులు నూనెతో ఆయిల్ బాత్ చేసుకోండి. కొంతమందికి నువ్వులు నూనె కొద్దిగా వేడి చేస్తుంది. అందువల్ల వారు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు.