శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (21:00 IST)

వాటిని వదిలేయాలి.. వీటిని తినాలి... అప్పుడు పురుషుల్లో...

ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలన లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు లైంగికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది శృంగార సమస్యలతో బాధపడుతున్నారు.
 
నేడు కనిపిస్తున్న శృంగార సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాల వలన, స్తంభన, స్ఖలన సమస్య, శృంగార కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం.శృంగార సామర్థ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి.
 
శృంగార హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటం వంటి వ్యసనాలుంటే వదిలించుకోవాలి.