శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:12 IST)

భోజనం తర్వాత వ్యాయామం చేయొచ్చా? వర్కవుట్‌కి ముందు స్నాక్స్ తీసుకుంటే?

భోజనం తర్వాత వ్యాయామం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత వ్యాయామం పేగులపైనా ప్రభావం పడుతుంది. ఒబిసిటీకి దూరం

భోజనం తర్వాత వ్యాయామం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భోజనం తర్వాత వ్యాయామం పేగులపైనా ప్రభావం పడుతుంది. ఒబిసిటీకి దూరంగా ఉండాలంటే తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఆలివ్ ఆయిల్‌లో కొబ్బరి నూనెలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది. ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వర్కవుట్‌కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేమోగానీ, కండరాల నొప్పులు వస్తాయి.
 
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.