బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (22:50 IST)

చూపుడు వేలు కంటే ఉంగరపు వేలు పొడవుగా వుందా? ఐతే అలాంటి పురుషులు...

Fingers
మనిషి అవయవాల తీరును బట్టి వారి ఆరోగ్యం, లక్షణాలు ఆధారపడి వుంటాయని సైన్సులో పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. చేతివేళ్లను బట్టి కూడా పురుషులు ఎలాంటివారో చెప్పే అధ్యయనం ఒకటి తాజాగా వెల్లడైంది. పురుషుడి రెండవ- నాల్గవ వేళ్ల పొడవు మధ్య నిష్పత్తి అనేక రకాల శారీరక మరియు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంది.

 
పురుషుల కుడి చేతి చూపుడు వేలు ఉంగరపు వేలు కంటే పొట్టిగా ఉందా? ఈ అంకెల పొడవు యొక్క నిష్పత్తి వ్యక్తిత్వం, తెలివితేటలు, శరీరధర్మ శాస్త్రం వరకు ప్రతిదానిని సూచించగలదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. చూపుడు వేలు చిన్నదిగానూ, ఉంగరపు వేలు పొడవుగానూ ఉన్న పురుషులు స్త్రీల పట్ల మంచిగా ఉంటారు. పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ జర్నల్ ఈ విషయం ప్రచురించారు.

 
చూపుడు వేలు అనేది ఉంగరపు వేలు కంటే పొట్టిగా వుంటే పురుష హార్మోన్ల మొత్తాన్ని వెల్లడిస్తుంది. టెస్టోస్టెరాన్ ఎంత ఎక్కువైతే ఉంగరపు వేలు అంత పొడవుగా పెరుగుతుందని అధ్యయనం తెలిపింది.