బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (21:16 IST)

పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఖిలాడీ డైరక్టర్.. WHO అనే టైటిల్‌ ఫిక్స్

Ramesh Varma
Ramesh Varma
పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌... తెలుగు దర్శకుడితో చేతులు కలిపి పాన్ ఇండియా మూవీని తెరకెక్కించనుంది. రమేష్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. గ్రేట్ వీర, అభ్యత్ రాక్షసుడు, ఖిలాడీ వంటి సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం రమేష్ వర్మ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 
 
దేశంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయిన పూజా ఎంటర్‌టైన్మెంట్‌తో చేతులు కలపనున్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు ప్రస్తుతం WHO అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కింద ప్రస్తుతం ఈ టీమ్ పనిచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.  
 
ఈ సినిమాకు గాను ఈ సంవత్సరం భారీ డ్యాన్స్ బ్లాక్‌బస్టర్ పాట "ఊ అంటావా ఊ ఊ అంటావా"  (పుష్ప: ది రైజ్) కు సంగీతం సమకూర్చిన రాకింగ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. 
 
పూజా ఎంటర్‌టైన్‌మెంట్ 'WHO'ని 5 భాషలలో విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రూపొందించి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పాన్ ఇండియా జానర్‌లోకి అడుగుపెట్టింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ గతంలో కూలీ నంబర్ 1, జవానీ జానేమాన్, బెల్ బాటమ్ వంటి కొన్ని పెద్ద హిట్‌లను బాలీవుడ్‌కు అందించింది.