సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 25 మార్చి 2017 (17:34 IST)

మామిడి పండు తింటాం... అందులో ఏముంది?

వేసవి మొదలైంది. ఈ కాలంలో వచ్చేవి మామిడిపండ్లు. పోషకాహార రీత్యా చూసినప్పుడు ఈ పండులో కెరోటిన్ పుష్కలంగా వుంటుంది. పండిన మామిడి పండులో విటమిన్ సి సమృద్ధిగా లభ్యమవుతుంది. పొటాషియం, ఖనిజ లవణాలు కూడా ఇందులో వుంటాయి.

శిశువుల్లో ఏర్పడే రేచీకటిని మామిడి పండ్ల ద్వారా నివారించవచ్చు. 100 గ్రాముల మామిడి పండులో 44 క్యాలరీల శక్తి వుంటుంది. మామిడి పండును నేరుగా తినడమే కాకుండా వీటితో అనేక రకాల పదార్థాలను తయారు చేస్తారు. మామిడి రసం, ఊరగాయ, మామిడి తాండ్ర, జామ్ తదితర పదార్థాలను తయారుచేస్తారు. మామిడికాయలు తీసుకోవడం వల్ల పీచు పదార్థం, క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్ సి మన శరీరానికి అందుతాయి.