శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (22:50 IST)

ఈ 7 'టీ'లతో లాభాలు ఏమిటో తెలుసా?

టీ అంటే ఇష్టపడని వారుండరు. కొంతమంది టీ తాగడంతోనే రోజు ప్రారంభిస్తారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. కొలస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్

టీ అంటే ఇష్టపడని వారుండరు. కొంతమంది టీ తాగడంతోనే రోజు ప్రారంభిస్తారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని రకాల టీలను తాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. కొలస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
1. హెర్బల్ టీ : హెర్బల్ టీతో మనసుకు శరీరానికి స్వాంతన చేకూరుతుంది. అంతకంటే ఎక్కువగా శారీరక రుగ్మతలు కొంతమేరకు అదుపులోకి వస్తాయి. కాబట్టి రుగ్మతను బట్టి అవసరమైన హెర్బల్ టీను తయారుచేసుకుని తాగాలి.
 
2. బ్లాక్ టీ : ఈ టీని తాగడం వల్ల మదుమేహంతో పాటు హృద్రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా మన శరీరంలోని వాపులను తగ్గిస్తుంది.
 
3. పెప్పరమెంట్ టీ : ఈ టీని తాగడం వల్ల కఫం బయటకు వస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరిలా పని చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆకలిని తగ్గిస్తుంది.
 
4. దాల్చిన చెక్క టీ : ఈ టీ శరీరంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. వైరస్‌లతో పోరాడుతుంది. ఆర్ద్రయిటీస్ లక్షణాలను పారద్రోలుతుంది. శరీరానికి స్వాంతన చేకూరుస్తుంది.
 
5. గ్రీన్ టీ :  దీనిలో యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువ. ఇది చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కణాలు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడుతుంది.
 
6. శొంఠి టీ : ఇది అలర్జీలను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ప్లమేటరిగా పని చేస్తుంది. ప్రయాణాల్లో తలెత్తే మోషన్ సిక్‌నెస్‌ని నివారిస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది.
 
7. వైట్ టీ : ఇందులో అత్యధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో కెఫిన్ ఎంతో తక్కువ. ఇది రక్తపోటు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. హానికారక బ్యాక్టీరియాని చంపుతుంది.