బుధవారం, 15 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (10:11 IST)

టూత్ పేస్టులతో క్యాన్సర్ వస్తుందట.. సిగరెట్‌లో ఉండే నికోటిన్ కంటే ఎక్కువగా ఉంటుందట!

పొద్దున లేవగానే మొదట చేసే పని బ్రషింగ్. అందుకోసం రకరకాల టూత్ పేస్టులు వాడుతుంటారు. పళ్ళు, బలమైన చిగుళ్ళు, మంచి శ్వాస కావాలంటే ఈ టూత్ పేస్టునే వాడండి అంటూ ఎన్నో సంస్థలు ప్రకటనలిస్తున్నాయి కూడా. అయితే ఈ

పొద్దున లేవగానే మొదట చేసే పని బ్రషింగ్. అందుకోసం రకరకాల టూత్ పేస్టులు వాడుతుంటారు. పళ్ళు, బలమైన చిగుళ్ళు, మంచి శ్వాస కావాలంటే ఈ టూత్ పేస్టునే వాడండి అంటూ ఎన్నో సంస్థలు ప్రకటనలిస్తున్నాయి కూడా. అయితే ఈ టూత్ పేస్టులు వాడడం వల్ల తెల్లటి పళ్లు సంగతిని అటుంచితే కేన్సర్ రావడం మాత్రం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజూ పొద్దున యావత్ ప్రపంచ ప్రజలు ఉపయోగించే టూత్ పేస్ట్‌లో విచ్చలవిడిగా నికోటిన్ వాడుతున్నారని ఢిల్లీ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. రకరకాల టూత్ పౌడర్లు 20 రకాల టూత్ పెస్తులను పరిశీలిస్తే అందులో 11 రకాల్లో  నికోటిన్ ఉన్నట్టు తేలిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది కూడా కొద్దిగా కాదు పెద్ద మొత్తంలో వాడుతున్నట్టు తేలింది. 
 
నిజానికి సిగరెట్‌లో 1 గ్రాముకు 2 నుంచి 3 మిల్లీ గ్రాముల నికోటిన్ ఉంటుంది. అయితే ఈ టూత్ పేస్టులో మాత్రం 1 గ్రాముకు 18 మిల్లీ గ్రాముల నికోటిన్ వాడుతున్నారని తేలింది. అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి.