శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (19:21 IST)

బొప్పాయి గింజల పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే? (video)

Papaya seeds
బొప్పాయి గింజల పొడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయి గింజలను ఎండలో ఎండబెట్టాలి. ఆపై పొడి చేసుకుని.. జల్లెడలో జల్లించుకుని.. డబ్బాలో భద్రపరుచుకోవాలి. రోజూ ఈ పొడిని నీటిలో కలుపుకుని తీసుకుంటే మంచిది. ఈ పొడిని ఫ్రిజ్‌లో వుంచి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాకాకుండా రోజూ ఇంటివద్దే బొప్పాయి గింజలు లభిస్తే.. అలానే పచ్చిగా తీసుకోవచ్చు. 
 
బొప్పాయి గింజలను బాగా పేస్టులా రుబ్బుకుని.. అందులో కాసింత నిమ్మరసం చేర్చి తీసుకుంటే కాలేయ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే.. కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి గింజల పొడి అరస్పూన్ తీసుకుని తేనెతో కలుపుకుని తీసుకుంటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రోజుకు 8-10 లీటర్ల నీటిని సేవించడం మరిచిపోకూడదు. 
 
అర గుప్పెడు బొప్పాయి గింజలను నీటిలో ఉడికించి.. ఆరిన తర్వాత సేవిస్తే కిడ్నీలో రాళ్లు రానీయకుండా నిరోధించవచ్చు.  బొప్పాయి గింజల పొడిని నీటిలో కలుపుకుని సేవించడం ద్వారా కడుపులోని నులిపురుగులు తొలగిపోతాయి. బొప్పాయి గింజల పొడిని కొబ్బరి నూనెతో కలిపి తల మాడుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే.. జుట్టు దట్టంగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.