నారింజ రసం తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాల్సిందే...
నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ - ఏ, బి స్వల్పంగా, విటమిన్ - సి ఎక్కువగా ఉంటాయి. మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్ ఈ పండు నుంచి లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది.
నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని హరింపజేస్తుంది.
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది.
నారింజలో మాంసకృత్తులు - 0.9%, పిండి పదార్ధాలు - 10.6%, క్రొవ్వు - 0.3%, ఇనుము - 01% శాతం ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.