మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (17:26 IST)

ఎముకల పటుత్వానికి రాగి మాల్ట్ తాగండి..

రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభి

రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.
 
మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. 
 
రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది. రాగి మాల్టు ఎముకల పటుత్వానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.