శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (22:41 IST)

Jasmine Tea, మల్లెపూల టీ ఎంత మంచిదో తెలుసా?

శీతాకాలం క్రమంగా కరిగిపోయి వేసవి వస్తుంది అనగానే మల్లెపూల గుబాళింపులు వచ్చేస్తాయి. ఈ మల్లపూలు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి నుంచి తయారుచేసే టీలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఐతే ఈ టీని ఎలా చేయాలో చూద్దాం. తాజా మొగ్గలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టాలి. దాంట్లో ఒక చెంచా మామూలు టీపొడి వేయాలి, ఐతే టీపొడి కన్నా మల్లెమొగ్గలు ఎక్కువగా ఉండాలి.
 
ఒక చెంచా టీ పొడికి ఏడు చెంచాల మల్లెమొగ్గలు తీసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళను మరగనించి, అవి బాగా మరిగినాక వాటిని గిన్నెలో పెట్టుకున్న మల్లెలు, టీ పొడి పెట్టిన గిన్నెలో పోసి కొంచెంసేపు మూత పెట్టాలి. ఆ తర్వాత ఐదు నిముషాలు ఆగి దానిని వడకట్టి, దానిలో పటికబెల్లం పొడి కానీ లేదంటే తేనె కాని కలిపి త్రాగవచ్చు.
 
ఈ మల్లెపూల టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులను, పక్షవాతం రావు. లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది. 
 
ఈ టీతో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే హాయినా ఉంటుంది.