శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:15 IST)

ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలనిపిస్తే.. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుందా?

ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలపిస్తే.. పండ్ల రసాలు, కాచి చల్లార్చిన పాలు, కాస్త తేనె కలిపి ఐస్ ట్రేలలో పోయాలి. అందులో ఓ టూత్ పిక్ ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. గడ్డకట్టాక దానిని ఐస్ ఫ్రూట్‌గా తీసుకోవచ్చు. శీతల

ఐస్‌క్రీమ్‌లు బాగా తినాలపిస్తే.. పండ్ల రసాలు, కాచి చల్లార్చిన పాలు, కాస్త తేనె కలిపి ఐస్ ట్రేలలో పోయాలి. అందులో ఓ టూత్ పిక్ ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. గడ్డకట్టాక దానిని ఐస్ ఫ్రూట్‌గా తీసుకోవచ్చు. శీతలపానీయాలూ, బ్రెడ్డూ, కెచప్‌లలో ఇలా రకరకాల ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకున్నప్పుడు వాటిలో ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడే వాటిలో చక్కెర శాతం ఎంతో చూసుకోండి. తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోండి.
 
ఆహారంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. టీ, కాఫీల్లో చక్కెం తప్పనిసరే. కానీ ఎప్పుడూ వాటినే తాగాలని లేదు. తరచూ గ్రీన్‌ టీ వంటివి ఎంచుకుంటూ అప్పుడప్పుడూ కాఫీ, టీలూ తీసుకోండి. వీటివల్ల బరువు పెరుగుతారనే ఇబ్బంది కూడా ఉండదు.
 
గ్రీన్ టీలోనూ కెఫిన్‌ ఉంటుంది కానీ.. అదనంగా ఎల్‌-థియనైన్‌ అనే అమినోయాసిడ్‌ మనకెంతో మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది. గ్రీన్‌టీలో ప్రత్యేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి వార్థక్యపు ఛాయలు రాకుండా కాపాడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.