శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:46 IST)

రాత్రిపూట నిద్ర చెడగొట్టేవి అవే...

రాత్రివేళల్లో నిద్రపట్టక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటివారు ఈ క్రింది చిట్కాలు పాటించాలి. నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ ఘనపదార్థాలను కానీ తీసుకోకూడదు. అందువల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ, కాఫీలను ఎక్కువగా తాగరాదు. టీ కాఫీలకు బదులుగా బాదం మిల్క్ మొదలగునవి తీసుకోవచ్చు. 
 
గోరువెచ్చని పాలు గ్లాసుడు నిద్రించే ముందు రాత్రిపూట తాగితే మంచిది. పగటిసమయంలో ఎక్కువగా నిద్రపోరాదు. అందువల్ల రాత్రి నిద్రరాదు. ఒంటరిగా పడుకోవడంవల్ల నిదురరాకపోతే ఆత్మీయుల చెంత నిద్రించండి. 
 
నిద్రరాదని మొరాయిస్తే మీకు ప్రియమైన సంగీతాన్ని వింటూ మీకు తెలియకుండా నిద్రలోకి జారిపోండి. నిద్రమాత్రలకు దూరంగా వుండండి. వాటిని నిద్రకోసం వాడకూడదు. అలా వాడితే నిద్రమాత్రలు ఒంటికి అనారోగ్యం. 
 
నిదురించే ముందు ఎలాంటి ఆలోచనలు చేయరాదు. నిదురరాదని మొరాయిస్తే మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి. అలాచేస్తే చదువుతూనే నిద్రపోతారు. పదేపదే పడకస్థానాన్ని మార్చవద్దు. కొత్తప్రదేశం నిద్రకు ఇబ్బంది కలుగజేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.