శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:00 IST)

ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి.. ఏమవుతుందో?!

ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి. ఆశ్చర్యపోకండి, సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది.

ఉల్లిపాయల భయంకర వాసన అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దాని ఆరోగ్యలాభాలు తెలుసుకున్నాక ఆ వాసనని మర్చిపోయి వాటి లాభాలను ఆస్వాదిస్తారు.
 
ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.
 
మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సుల్లో ఉంచుకోండి. అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిమీద సాక్సు వేసుకోండి. పిల్లలకు కూడా ఇది సురక్షితమే. నిజానికి ఇంగ్లండ్ లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారు.
 
1 జలుబును తగ్గిస్తుంది మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది. ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సులో ఉంచుకొని, రాత్రంతా అలానే ఉంచండి. ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది.